నీవెంటే నేను నిబ్బరముగాను  నడిచెదను కడవరకును SONG LYRICS 4U | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |
పల్లవి:-
నీవెంటే నేను నిబ్బరముగాను 
నడిచెదను కడవరకును (2)
నీ కాంతిలోనూ  నిశ్చయతతోను (2)
సాగెదను నీ త్రోవను యేసయ్యా...(2)
(నీవెంటే నేను)
చరణం:-1
పెనుగాలులందు  తలదించకుందు
నీ మాట నే నమ్ముకొందు ....(2)
చలిరాత్రులందు చలియించకుందు 
శ్రమలైనను ఓర్చుకుందు (2)
ఏ చర అయినా ఏ కరువయినా
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను)
చరణం:-2
అడ్డంకులందు చింతించకుందు
నీ సాయమే  కోరుకుందు...(2)
ఇబ్బందులందు వెనుతిరగకుందు
వాగ్దానముల ఆనుకొందు....(2)
ఏ తెగులైన ఏ దిగులైనా 
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను)
చరణం:-3
కారడవులందు భయపడకయుందు
నీ నీడలో దాగుకొందు....(2)
ఉపద్రవములందు తడబడకయుందు
స్తుతి గీతమే పాడుకొందు....(2)
ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యిన
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....
(నీవెంటే నేను) 
 
0 కామెంట్‌లు